Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను ఎందుకు బహిష్కారంటే...

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (16:00 IST)
KK
తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పార్లమెంట్ సభ్యులు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు మొదటి నుంచి చెబుతూ వచ్చారు. తెరాస కొత్త నాటకానికి దారితీసిందని, మంగళవారం పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించబోతున్నారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదేపదే ఆరోపిస్తూ వచ్చారు. ఆయన మాటలను నిజం చేస్తూ తెరాస సభ్యులు ఇపుడు పార్లమెంట్ సమావేశాలను రద్దు చేశారు. 
 
దీనిపై తెరాస రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు స్పందిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని గత ఏడు రోజులుగా డిమాండ్ చేస్తూ, నిరసనలు తెలుపుతున్నామని, కానీ, కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్ళ విషయంలో భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. ప్రధానంగా బాయిల్డ్ రైస్ కొనబోమని చెబుతుందన్నారు. 
 
బాయిల్డ్ రైస్ కొంటారో లేదే కేంద్రం స్పష్టత ఇవ్వాలని కేశవరావు డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని సభలో నిలదీస్తే డొంక తిరుగుడు సమాధానాలు చెబుతోందని ఆరోపించారు. తెలంగాణ రైతులకు న్యాయం చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే తమ పార్టీ సభ్యులు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించినట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలపై కన్నేసిన బాలీవుడ్ హీరోలు!!

Actress Ramya: ఆ సన్నివేశాలను తొలగించాలి... కోర్టును ఆశ్రయించిన నటి రమ్య

జూనియర్ ఎన్.టి.ఆర్. పేరును వద్దన్న బాలక్రిష్ట

బాలకృష్ణ డాకు మహారాజ్ అసలు నిరాశ పరచదు : సూర్యదేవర నాగవంశీ

ఓటీటీకి నచ్చితేనే సెట్ కు వెళతాను : నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments