Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యాంగుడికి ఆపన్న హస్తం అందించిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (21:41 IST)
దివ్యాంగుడికి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆపన్న హస్తం అందించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి నడవలేని స్థితికి చేరిన జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన యువకుడు వినయ్‌కి మాజీ ఎంపీ కవిత మూడు చక్రాల స్కూటీని అందించారు.

వినయ్ దీనావస్తపై ఇటీవల పత్రికలో వచ్చిన కథనానికి చలించిన ఆమె అతడితో నేరుగా మాట్లాడి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో కలిసి వినయ్‌కు మూడు చక్రాల స్కూటీని అందించి అతడి తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
 
కోరుట్లో బీమునిదిబ్బ పోచమ్మగుడి సమీపంలో ఉంటున్న బోగ గణేశ్ సువర్ణ దంపతుల కుమారుడు వినయ్ చిన్ననాటి నుంచి చదువుల్లో రాణించి మంచి ర్యాంకులు సాధించాడు. హైదరాబాద్ లోని ఇంజినీరింగ్ కళాశాలలో 2014లో బీటెక్ పూర్తిచేశాడు. ఇంటికి వచ్చిన వినయ్ తన అక్కను వారింట్లో దింపడానికి వెళ్లి వస్తున్న సమయంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోయాడు.
 
వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాదులో శస్త్ర చికిత్స చేయించగా రూ.18 లక్షలు వరకు ఖర్చు అయ్యాయి. అయినా పరిస్థితి మెరుగుపడక పోవడంతో 6 ఏండ్లుగా వీల్ చైర్‌కే పరిమితమయ్యాడు. తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనలో ఉన్నారు. వినయ్ పరిస్థితిని గమనించి సాయం అందించిన మాజీ ఎంపీ కవితకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments