Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచి చేస్తే మర్చిపోతారు.. 24 గంటలు కాదు.. 2 గంటలిస్తే చాలు..?

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (17:01 IST)
ప్రజలకు మంచి చేస్తే మర్చిపోయే అవకాశం ఉందని టీఆర్ఎస్ జడ్చర్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్చర్లలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రకృతి వనం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్న విషయాన్ని కూడా మర్చిపోయారని... అందుకే రోజుకు 3 లేదా 4 గంటల పాటు మాత్రమే విద్యుత్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరాలనుకుంటున్నానని చెప్పారు. 
 
ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ఆపేయాలని అన్నారు. జనాలను మంచివారు అనాలో, లేక అమాయకులు అనాలో అర్థం కావడం లేదని లక్ష్మారెడ్డి చెప్పారు. సంక్షేమ పథకాలను ఇవ్వడం కూడా అనవసరమని... ఎన్నికలకు ఏడాది ముందు మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందని అన్నారు. లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments