Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిష్ఠాత్మక అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (09:36 IST)
తెలుగు ప్రతిభావంతులకు ప్రతి ఏటా ప్రదానం చేసే ప్రతిష్టాత్మక అవార్డులకు ప్రముఖ సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ 'అర్పిత ' దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. గణగళ్ళ విజయ్ కుమార్ తెలిపారు.

సంస్థ 19వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విద్య, వైద్యం, విధి నిర్వహణ, సామాజిక సేవ, నృత్యం, క్రీడలు, కళలు, సాహిత్యం, చిత్రలేఖనం, శాస్త్రీయ సంగీతం (నాదస్వరం, డోలు, సాక్సోఫోన్, గాత్రం) ఆధ్యాత్మికం, ఉపాధి కల్పన తదితర రంగాల్లో ప్రతిభ గల వ్యక్తులు, చిన్నారులు అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరిగే ఎంపిక ప్రక్రియలో భాగంగా రాష్ట్ర స్థాయి 'ఆంధ్ర రత్న'  'తెలంగాణ రత్న' అవార్డులతో పాటు, పది మంది అత్యుత్తమ ఉపాధ్యాయులకు 'డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్' ఇతర రంగాల్లో సేవలందించిన పదిమందికి 'నేషనల్ బెస్ట్ సిటిజన్' మరియు 'లైఫ్ టైం అచీవ్ మెంట్' అవార్డులను అందజేయనున్నారు.

అంతేకాకుండా, అభ్యర్థుల కేటగిరీల వారీగా 'కళాబంధు' ఎన్టీఆర్ స్మారక 'కళా విభూషణ్' డాక్టర్ సీ.నా.రే స్మారక 'సాహిత్య కళానిధి' ప్రముఖ నృత్య కళాకారులకు 'సిద్ధేంద్రయోగి నాట్య కళా విశారద' 'ఎస్సీ బాలు స్మారక
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్' జాతీయ అవార్డులతో పాటు ఏదైనా మూడు రంగాల్లో విశేష ప్రతిభ గల ఇద్దరికి భారతదేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన " భారత ప్రతిభా రత్న " ప్రతిష్ఠాత్మక పురస్కారం అందజేయనున్నామని వివరించారు.

ఆసక్తి, ప్రతిభ ఉన్నవారు తమ దరఖాస్తులను 9391379903 వాట్సాప్ నెంబర్ కు నవంబర్ ఐదవ తేదీ లోగా పంపుకోవాలన్నారు. ఎంపికైన వారికి డిసెంబర్ ఐదవ తేదీన హైదరాబాదులోని రవీంద్రభారతి ఆడిటోరియంలో అవార్డులను ప్రధానం చేయనున్నామని డా.గణగళ్ళ విజయ్ కుమార్ వివరించారు. మరిన్ని వివరాలకు 7780589775 సెల్ నెంబర్లో సంప్రదించాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

కాలికి గాయంతో జపాన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రభాస్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

తర్వాతి కథనం
Show comments