Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కత్తి మధులిక పుర్రెను చీల్చి మెదడుని తాకింది... విషమంగానే... ఉన్మాదికి 14 రోజులు...

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (14:21 IST)
హైదరాబాద్ బర్కత్‌పురలో బుధవారంనాడు ఇంటర్ విద్యార్థిని మధులికపై కొబ్బరిబొండాలు కొట్టే కత్తితో ప్రేమోన్మాది భరత్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇతడిని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఆమెపై దాడిని ఓ పథకం ప్రకారమే చేశానని పోలీసుల ఎదుట భరత్ చెప్పినట్లు తెలుస్తోంది.
 
మరోవైపు యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధులిక పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే వున్నట్లు వైద్యులు చెపుతున్నారు. పదునైన కత్తితో ఆమె తలపై దాడి చేయడంతో ఆమె పుర్రె ఎముక చీలిపోయిందనీ, మెదడుని తాకిందని తెలిపారు. ఇంకా పలుచోట్ల తీవ్ర గాయాలు వుండటంతో ఆమెకి వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
 
తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెకి ఇప్పటివరకు 15 యూనిట్ల రక్తం ఎక్కించామనీ, శరీరంలో 15 చోట్ల గాయాలయ్యాయని తెలిపారు. తలపై నాలుగుసార్లు నరకడంతో మెదడు లోపల తీవ్ర గాయాలయ్యాయనీ, ఆమె బీపి నార్మల్ అయిన తర్వాత శస్త్ర చికిత్స చేయాలనుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments