Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ ఊఁ.. అంటే చాలు.. 300 కిమీ లోతుకు తొక్కేస్తాం : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (17:41 IST)
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అధికార తెరాస పార్టీ నేతలు గట్టివార్నింగ్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ కనుసైగ చేస్తే చాలు రేవంత్ రెడ్డిని 300 కిలోమీటర్ల లోతుకు తొక్కేస్తాం అంటూ తెరాస ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హెచ్చరించారు. రేవంత్ తెలంగాణ ద్రోహి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
బుధవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా బహిరంగసభలో రేవంత్ రెడ్డి అన్నీ అబద్ధాలే మాట్లాడారని అన్నారు. నిరుద్యోగులకు, మహిళలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని చెప్పారు. మహిళల రుణాలకు రూ.200 కోట్ల వడ్డీ చెల్లించామని తెలిపారు. ఇప్పటివరకు లక్షా 26 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు.
 
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు భూమిలో పాతి పెట్టారని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. రాష్ట్రంలో సోనియా రాజ్యం వచ్చే పరిస్థితే లేదన్నారు. 2009లో పొత్తు వల్లే రేవంత్ గెలిచారని... కేసీఆర్ వల్లే రేవంత్‌కు టీపీసీసీ ఉద్యోగం వచ్చిందని అన్నారు. కేసీఆర్ ఆదేశిస్తే రేవంత్ ను 300 కిలోమీటర్ల లోతుకు తొక్కుతామని ఆయన హెచ్చరించారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments