'మనం సైతం'కు అండగా ఉంటా - కేటీఆర్

Webdunia
శనివారం, 27 జులై 2019 (18:54 IST)
మనం సైతం సేవా సంస్థ వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల మనం సైతం సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలను ఆయనకు వివరించారు. మనం సైతం తరపున మొక్కను, బ్రోచర్‌ను అందించారు. మీరు అనుకున్న కార్యక్రమాలు చేయండి నేను అండగా ఉంటానంటూ కేటీఆర్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
 
త్వరలో మనం సైతం నిర్వహించబోయే మెగా కార్యక్రమంలో పాల్గొంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎంతో బిజీగా ఉన్నా కలిసేందుకు సమయం ఇచ్చిన కేటీఆర్‌కు కాదంబరి కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ మార్గదర్శనంలో మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తామని కాదంబరి కిరణ్ తెలిపారు. 
 
కాదంబరితో పాటు కేటీఆర్‌ను కలిసిన వారిలో పరుచూరి వెంకటేశ్వరరావు, వల్లభనేని అనిల్, రమేష్ రాజా, మహానందరెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, మనం సైతం సభ్యులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments