Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆయన ట్విట్టర్ కే పరిమితం.. కేటీఆర్ పై డీకే అరుణ ఫైర్

Advertiesment
ఆయన ట్విట్టర్ కే పరిమితం.. కేటీఆర్ పై డీకే అరుణ ఫైర్
, సోమవారం, 8 జులై 2019 (08:47 IST)
టీఆర్ఎస్ నాయకులు కమీషన్ ఏజెంట్లుగా వ్వవహరిస్తున్నారని అన్నారు బీజేపీ నాయకురాలు డీకే అరుణ. నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆమె..  ప్రాజెక్టులకు పైసలు కర్చుపెడుతున్నామంటూ…  వేల కోట్ల ధనాన్ని టీఆర్ఎస్ నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు.
తొందరలోనే టీఆర్ఎస్ చేసిన అవినీతిని తాము బయటపెడతామని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని అసహ్యించుకుంటున్నారని తెలిపారు. టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని చెప్పారు.
 
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జీజేపీ విజయం సాధిస్తుందని  చెప్పారు అరుణ. సీఎం కొడుకు కేటీఆర్ ప్రాథినిధ్యం వహిస్తున్న స్థానంలో బీజేపీ ఎంపీ స్థానాన్ని గెలుచుకుందని అన్నారు. కవిత స్థానాన్ని కూడా బీజేపీ  గెలుచుకోవడాన్ని ఆమె గుర్తు చేశారు.
అవినీతికి తావు లేదన్న కేసీఆర్.. ఆయన బిడ్డ కవిత పై చాలా ఆరోపణలు వచ్చినా విచారణ జరిపించలేదని చెప్పారు. ఇక.. కేటీఆర్ ట్విట్టర్ కి పరిమితం అయ్యారని ఎద్దేవాచేశారు అరుణ. తెలంగాణ దేశానికి ఆదర్శం అనడం పచ్చి అబద్ధమని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గొల్లపూడిలో గంజాయి కలకలం..విజయవాడను వణికిస్తున్న డ్రగ్స్ మాఫియా