మైకేల్ జాన్సన్‌ను తలపించే డ్యాన్స్.. మైట్రో కార్మికుడి అదిరే డ్యాన్స్ (వీడియో)

మంగళవారం, 11 జూన్ 2019 (10:12 IST)
ఎంతోమంది నైపుణ్యం కలవారు కార్మికులుగానూ.. చిన్న చిన్న ఉద్యోగాల్లో స్థిరపడిపోతుంటారు. ఇదే తరహాలో ఓ నిర్మాణ కార్మికుడు.. తనలో మైకేల్ జాన్సన్‌ను తలపించే నైపుణ్యాన్ని పదిలంగా వుంచుకున్నాడు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని అతని డ్యాన్స్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో కొన్ని వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు. 
 
అలాంటి వారిలో ఓ నిర్మాణ కార్మికుడు... లంచ్ బ్రేక్‌లో తన తోటి వర్కర్ల ముందు డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశాడు. ఆ డాన్స్ చూస్తే... సినిమాల్లో హీరోలు కూడా షాకవ్వాల్సిందే. అంత అద్భుతంగా డ్యాన్స్ అదరగొట్టేశాడు. దాదాపు మైకేల్ జాక్సన్ స్టెప్పుల్ని దించేశాడు. ఆతని డ్యాన్స్‌ను తలపించాడు. 
 
ఓ కర్రతో ఎంతో ఈజీగా అతను ఆ స్టెప్పులు వెయ్యడం చూస్తే... అతను మూవీ ఆర్టిస్టేమో అన్న డౌట్ రాక మానదు. తమ ప్రాజెక్టులో ఇలాంటి టాలెంటెడ్ వర్కర్లు ఉండటంపై ఎంతో సంతోషిస్తున్నామని మెట్రో రైల్ ఎండీ ట్వీట్ చేశారు. 
 
ఇలాంటి వారిని చూసి గర్వపడుతున్నామన్నారు. ఇంకా సదరు వ్యక్తి ఆడిన డ్యాన్స్ వీడియోను కూడా పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... సూపర్ టాలెంట్ అని ప్రశంసిస్తూ రీ ట్వీట్ చేశారు. 

pic.twitter.com/A8SpcDHUqt

— MD HMRL (@md_hmrl) June 9, 2019

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఏ మంత్రైనా అలా చేశారని తేలితే ఆ క్షణమే పీకేస్తా, సీఎం జగన్ వార్నింగ్... కేబినెట్ కీలక నిర్ణయాలు