ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మంత్రిమండలి సమావేశమైంది. ఈ సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలు ప్రకటించారు. మంత్రులతో చర్చించి కీలక నిర్ణయాలపై ఆమోదం తెలిపారు. వాటిలో కొన్ని...
1. నష్టాల ఊబిలో చిక్కుకుని కొట్టుకులాడుతున్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం
2. మంత్రులెవరైనా అవినీతికి పాల్పడితే మంత్రివర్గం నుంచి బర్తరఫ్.
3. రెండున్నరేళ్లు మంత్రి పదవి గ్యారంటీ అనుకోవద్దంటూ హెచ్చరిక.
4. జనవరి 26 నుంచి అమలులోకి అమ్మ ఒడి... పిల్లల్ని చదివించే ప్రతి తల్లికీ రూ.15వేలు చెక్కులు.
5. టీటీడీ పాలకమండలిని రద్దు చేసేందుకు చర్యలు.
6. అక్టోబర్ 15 నుంచి రైతుభరోసా పథకం. ఈ పథకం కింద రైతులకు రూ.12,500
7. వైయస్ఆర్ భరోసా పేరుతో వడ్డీలేని రుణాలు.
8. మహిళలకు ఉగాది కానుక. గ్రామాల్లో అర్హత కలిగి ఇంటి స్థలం లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఇళ్ల స్థలాలు.
9. అంగన్వాడీ వర్కర్ల వేతనం రూ.11,500కు పెంపు.
10. మధ్యాహ్న భోజనం కార్మికుల వేతనాలను రూ.3 వేలకు పెంపు.