ఆఫ్రికా దేశమైన సియారా లియోన్‌లో దాదాపు 3,00,000 మహిళలు సెక్స్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. వారిలో ఓ మహిళ సెక్స్ వర్కర్లుగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను గురించి చెప్పుకొచ్చింది.
సియరా లియోన్‌లో 18 ఏళ్ల పట్మా తాను సెక్స్ వర్కర్‌గా ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వెల్లడించింది. సెక్స్ వర్కర్లుగా వున్న తమ వద్దకు వచ్చే పురుషులు.. ఇంటికి తీసుకెళ్తారు. రోజంతా తమను వాడుకుంటారు.
కానీ చాలా తక్కువ మొత్తాన్ని చేతులో పెడతారు. కేవలం రూ.40లే ఇస్తుంటారు. ఇలా రోజు తక్కువ మొత్తం తీసుకుంటూనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఒక రోజు కూడా పురుషులు దొరకలేదంటే.. ఆకలితో వుండిపోవాల్సిన పరిస్థితి తప్పదని ఆమె వెల్లడించింది.
అంతేగాకుండా ఓ రోజు రాత్రి ఏడు నుంచి ఎనిమిది పురుషులతో పడక పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తన శరీరానికి రూ.391 మాత్రమే ఇస్తారు. ఈ మొత్తంలో కండోమ్ కూడా కొనుక్కోని పరిస్థితి.
ఎందుకంటే కండోమ్ కోసం ఖర్చు పెట్టాల్సిన మొత్తం రూ.196 అని పట్మా చెప్పుకొచ్చింది. తనకు ఇద్దరు చెల్లెళ్లు వున్నారని.. ఇలా సెక్స్ వర్కర్‌గా పనిచేసి వారని చదివిస్తున్నానని చెప్తూ పట్మా కన్నీటి పర్యంతం అయ్యింది.