Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిఫ్ట్ ఇచ్చిన పాపానికి పోలీసుకే కిలేడీ చుక్కలు.. ఏం చేసిందంటే?

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (09:48 IST)
లిఫ్ట్ ఇచ్చిన పాపానికి పోలీసుకే ఓ మహిళ చుక్కలు చూపించింది. మహిళా దొంగ అర్థరాత్రి ఒంటరిగా ఉన్నానంటూ.. లిఫ్టు అడిగి ఏకంగా ఓ కానిస్టేబుల్ నుండే బంగారు గొలుసు కొట్టెసింది. అయితే చివరికి ఆ కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసును చేధించి యువతిని పోలీసులు అరెస్ట్ చేసారు. 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ సన్‌సిటీలో నివాసం ఉండే ఈశ్వర్‌ ప్రసాద్‌ ఏఆర్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా ఈ నెల 12న రాత్రి 8:30 సమయంలో విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా గ్రీన్‌ల్యాండ్స్‌ వద్ద ఓ యువతి లిఫ్ట్‌ అడగగా ఆమెకు లిఫ్ట్‌ ఇచ్చాడు.
 
రాత్రి 9 గంటలకు ఆమెను పంజగుట్టలో దింపి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే ఆ యువతి కానిస్టేబుల్‌ను మాటల్లోకి దింపింది. దీంతో కానిస్టేబుల్ మెడలో ఉన్న గొలుసును కొట్టేసింది. అయితే ఇది గమనించని కానిస్టేబుల్ నేరుగా ఇంటికి వెళ్లి స్నానం చేసే సమయంలో తన బంగారు గొలుసు మాయమైనట్లు తెలుసుకున్నాడు. వెంటనే తాను విధులు నిర్వహించిన స్థానానికి వెళ్లి వెతికాడు.
 
కాని అక్కడ కూడా లేకపోవడంతో.. దీంతో వెంటనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. సీసి కెమెరాలను పరిశీలించి నిందుతురాలు ఎవరనే విషయాన్ని కనుకొన్నారు.
 
అయితే ట్విస్ట్ ఏటంటే దొంగతనం చేసిన మహిళ.. మరోసారి మహంకాళి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కూడా ఇలాంటీ ప్రయత్నం చేయడంతో ఆ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అసలు విషయం ఒప్పుకుంది. కాగా ఆమె ట్రాన్స్‌జెండర్ అని బెంగళూరులో ఉంటూ దొంగతానల కోసమే హైదరాబాద్‌కు వచ్చి వెళ్లిపోతుందని పోలీసులు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments