Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టిన రోజు నాడే ఆమెకు చివరి రోజు.. రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు దాటుతూ..?

Webdunia
గురువారం, 19 మే 2022 (11:59 IST)
పుట్టిన రోజు నాడే ఆ మహిళ మరణించింది. సాయంత్రం బర్త్ డే పార్టీ చేసుకుందామని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లిన మహిళ విగతజీవిగా ఇంటికి చేరడంతో ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన ఖైరతాబాదులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... మహారాష్ట్ర షోలాపూర్ ప్రాంతానికి చెందిన లావణ్య ఇద్దరు కూతుళ్లు, తండ్రి, సోదరుడితో కలిసి ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చింది. వీరంతా ఖైరతాబాద్ తుమ్మలబస్తీలో అద్దెకుంటున్నారు. లావణ్య ఖైరతాబాద్‌లోనే ఓ కంపనీలో టెలీకాలర్‌గా పనిచేస్తోంది. ఆమె తండ్రి, సోదరుడు కూడా పనులు చేస్తున్నారు. ఇలా ఆనందంగా సాగుతున్న వీరి జీవితంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. 
 
బుధవారం లావణ్య పుట్టినరోజు కావడంతో అందంగా ముస్తాబై ఫోటో తీసుకుంది. కూతుళ్లు, తండ్రి, సోదరుడు పుట్టినరోజు విషెస్ తెలుపగా సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చాక బర్త్ డే పార్టీ చేసుకుందామని చెప్పింది. ఇలా ఆఫీస్‌కు బయలుదేరిన లావణ్య తిరిగి ఇంటికి చేరుకోలేదు.   
 
ఆఫీస్ కు వెళుతూ ఖైరతాబాద్ రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా ఒక్కసారిగా ఎంఎంటీఎస్ ట్రెయిన్ వేగంగా దూసుకొచ్చింది. తప్పించుకునే క్రమంలో దాదాపు పట్టాలు దాటేసినా రైలు వేగానికి ఒక్కసారిగా ఎగిరి కిందపడింది. 
 
పట్టాలపై వుండే రాళ్లు తలకు తగలడంతో తీవ్రంగా గాయపడిన లావణ్య అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.  పుట్టినరోజునే లావణ్య మృతిచెందడంతో తీవ్ర విషాదం  నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments