Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీకు భర్త ఎందుకు..? చంపేయ్.. నాతో వచ్చేయ్.. మహిళకు వేధింపులు

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (19:25 IST)
మనదేశంలో పాశ్చాత్య సంస్కృతి తాండం చేస్తోంది. సమాజంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఒకవైపు అక్రమ సంబంధాలతో నేరాల సంఖ్య పెరిగిపోతుంటే.. మరోవైపు మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి.

తాజాగా హైదరాబాదులో భర్తను చంపేసి.. తనతో వచ్చేయాల్సిందిగా ఓ వివాహితను ఓ కామాంధుడు వేధించాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. వనస్థలిపురం సాహెబ్ నగర్ చెందిన బాలమణికి ఇబ్రహీంనగర్ బంజారా హిల్స్‌లో ఓ పత్రిక లోపని చేసే గొట్టేటి శివ ప్రసాద్ పరిచయం అయ్యాడు. ప్రసాద్ గత 4 సంవత్సరాలుగా వీళ్ళ ఇంటి ప్రక్కనే కిరాయికి ఉంటున్నాడని సమాచారం. ఆ పరిచయంతో ఆమె ఫోటోలు, వీడియోలు భర్తకు చూపించి సోషల్ మీడియా పెడతానని బాధిత మహిళని బెదిరించి లోబర్చుకున్నాడు శివ ప్రసాద్. ఇంకా శివ ప్రసాద్ అనే వ్యక్తి అత్యాచారం చెసినట్లు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. భర్తను చంపేసి తనతో వచ్చేయాల్సిందిగా ప్రసాద్ బెదిరిస్తున్నాడని పోలీసులకు తెలిపింది. 
 
ఈ నెల 18వ తేదీన బాధిత మహిళ ఇంటికి చేరుకొని ఒంటరిగా ఉన్న సదరు మహిళను బెదిరించి అత్యాచారానికి పాల్పడితే ప్రతిఘటించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది మహిళ. అతని వల్ల తమకు ప్రాణహాని వుందని రక్షణ కావాలని బాధిత మహిళ పోలీసులను కోరింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు 376, 506, సెక్షన్ క్రింద కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రం అప్ డేట్

45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శంకరాభరణం

60 ఏళ్ల వయసులో బెంగళూరు యువతిని ప్రేమించిన బాలీవుడ్ గజిని అమీర్ ఖాన్

అజిత్ కుమార్ పట్టుదలకు యు/ఎ సెన్సార్

అప్సరా రాణి రాచరికం మూవీ ఎలా ఉందంటే.. రాచరికం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments