Webdunia - Bharat's app for daily news and videos

Install App

బక్రీద్ ఫెస్టివల్... భాగ్యనగరి ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

Webdunia
బుధవారం, 28 జూన్ 2023 (13:48 IST)
బక్రీద్ పండగను పురస్కరించుకుని గురువారం హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. పాత బస్తీలోని పలు రహదారులపై వాహన రాకపోకలను నిలిపివేశారు. ముస్లింల ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో ఈ ట్రాఫిక్ మార్పులు చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు మీరాలం ట్యాంక్ ఈద్గా ప్రాంతంలో వాహనాలను వేరే రూట్లకు మళ్లిస్తామని హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీస్ విభాగం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఆంక్షలు ఉండే రూట్లు ఇవే.. 
 
బహదూర్‌పురా క్రాస్ రోడ్డు మీదుగా ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల మధ్య పురానాపూల్, కామాటిపురా, కిషన్‌బాగ్ వైపు నుంచి ఈద్గాకు ప్రార్థనల కోసం వచ్చే వారిని అనుమతిస్తారు. జూపార్కు, మసీద్ అల్వా రాకపోకలు ఆపేస్తారు. అక్బర్ ఎదురుగా వాహనాల పార్కింగ్.. దీంతో ఈద్గా రోడ్డు వైపు ఆ రూట్లలోని ట్రాఫిక్‌ను బహదూర్‌పురా క్రాస్ రోడ్డు వద్ద కిషన్‌బాగ్, కామాటిపురా, పురానాపూల్ వైపు మళ్లిస్తారు.
 
శివరాంపల్లి వైపు నుంచి ప్రార్థనల కోసం వచ్చే అన్ని వాహనాలను ధనమ్మ హట్స్ రోడ్డు నుంచి అనుమతిస్తారు. ఈద్గా వైపు వెళ్లే వాహనాలను ధనమ్మ హట్స్ క్రాస్ రోడ్స్ నుంచి శాస్త్రిపురం, ఎన్ఎస్కుంట రూట్లకు మళ్లిస్తారు. కాలాపత్తర్ నుంచి ఈద్గాకు వచ్చే వాహనాలను కాలాపత్తర్ ఠాణా, మోచీ కాలనీ, బహదూర్పురా వైపు మళ్లిస్తారు.
 
పురానాపూల్ నుంచి బహదూర్‌పురా వైపు వెళ్లే వాహనాలను పురానాపూల్ దర్వాజ వద్ద జియాగూడ, సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు. శంషాబాద్, రాజేంద్ర నగర్ వైపు నుంచి బహదూర్‌పురా వైపు వచ్చే వాహనాలను అరాంఘర్ జంక్షన్ నుంచి మళ్లిస్తారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments