Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదో తరగతి మార్కుల ఆధారంగా రైల్వే శాఖలో ఉద్యోగాలు...

Webdunia
బుధవారం, 28 జూన్ 2023 (12:58 IST)
వెస్ట్రన్ రైల్వేలో పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా ఏకంగా 3624 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో ఫిట్టర్, మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వైర్‌మేన్, మెకానిక్ రిఫ్రిజిరేటర్ (ఏసీ మెకానిక్), పైప్ ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్‌మేన్ (సివిల్) తదితర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ముంబై కేంద్రంగా పని చేసే వెస్ట్రన్ రైల్వే పరిధిలోని పోస్టులను భర్తీ చేయనున్నారు. 
 
పై పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 15 నుంచి 24 యేళ్లకు మించి ఉండరాదు. విద్యార్థులకు యేడాది కాల వ్యవధిలో అప్రెంటిస్‌ను అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు టెన్త్, ఐటీఐ మార్కుల ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఇక దరఖాస్తుల స్వీకరణకు జూలై 26వ తేదీని ఆఖరు తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం వెస్ట్రన్ రైల్వే అధికారిక వెబ్‌సైట్ చూడొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుర్రం పని గుర్రం చేయాలి.. గాడిద పని గాడిద చేయాలి : పోసాని - వర్మలకు ఈ సామెత తెలియదా?

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఆర్సీ16 ప్రారంభం

విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు... డేటింగ్‌లో 'గీతగోవిందం' జంట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments