Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ - చెన్నైల మధ్య తగ్గనున్న 300 కిలోమీటర్ల దూరం.. ఎలా?

Webdunia
బుధవారం, 28 జూన్ 2023 (12:22 IST)
దేశ రాజధాని ఢిల్లీ, ఆటోమొబైల్ హబ్ చెన్నై నగరాల మధ్య దూరం ఏకంగా 300 కిలోమీటర్ల మేరకు తగ్గనుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా ఈ రెండు ప్రాంతాల మధ్య కొత్త జాతీయ రహదారిని నిర్మిచనున్నారు. ఇది పూర్తయితే ఈ ప్రాంతాల మధ్య దూరం ఏకంగా 300 కిలోమీటర్ల మేరకు తగ్గుతుందని కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖామంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 
 
ప్రస్తుంత ఢిల్లీ - ముంబై ప్రాంతాల ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం సాగుతోంది. దీనికి అనుబంధంగా సూరత్‌ నుంచి చెన్నై వరకు నిర్మించే గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కారణంగా ఢిల్లీ - చెన్నై మధ్య రోడ్డు మార్గం 300 కిలోమీటర్ల మేర తగ్గనుందని నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో 9 ఏళ్లలో తమ మంత్రిత్వశాఖ చేపట్టిన పనులను, ఫలితాలను వెల్లడించారు.
 
'సూరత్‌ - నాసిక్‌ - అహ్మద్‌ నగర్‌ - సోలాపుర్‌ - కర్నూలు నుంచి హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై, కన్యాకుమారి, తిరువనంతపురం, కొచ్చి వరకు పలు రహదారులు నిర్మిస్తున్నాం. సూరత్‌ నుంచి సోలాపుర్‌ వరకు రూ.25 వేల కోట్లతో నిర్మిస్తున్న 719 కి.మీ. రహదారి నిర్మాణం 11 శాతం మేరకు పూర్తయింది. అలాగే సోలాపుర్‌ - కర్నూలు - చెన్నైమధ్య రూ.11 వేల కోట్లతో నిర్మిస్తున్న 340 కి.మీ రహదారి పనులు 13 శాతం పూర్తయ్యాయని తెలిపారు. 
 
రాయపూర్‌ - విశాఖపట్నం మధ్య రూ.17 వేల కోట్లతో నిర్మిస్తున్న 465 కి.మీ. రహదారి నిర్మాణం 34 శాతం పూర్తయింది. ఇండోర్‌ - హైదరాబాద్‌ మధ్య 525 కి.మీ. రహదారి నిర్మాణ పనులు 68 శాతం పూర్తయ్యాయిని, నాగ్‌పూర్‌ - విజయవాడ రహదారి నిర్మాణం 21 శాతం పూరి చేశామని తెలిపారు. మరోవైపు, నరేంద్ర మోడీ ప్రభుత్వం రహదారుల నిర్మాణంలో 7 ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. ప్రపంచంలో అమెరికా తరవాత అతిపెద్ద రోడ్‌ నెట్‌వర్క్‌ ఉన్న దేశంగా భారత్‌ అవతరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments