Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల ఐడియా అదుర్స్.. కడక్ నాథ్ కోళ్ల పెంపకం..

Webdunia
గురువారం, 13 మే 2021 (12:18 IST)
కరోనా కాలంలో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇక మిగిలిన సమయాన్ని బిజినెస్‌ల వైపు సద్వినియోగం చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాదు సాఫ్ట్ వేర్ యువకులు కడక్ నాథ్ కోళ్ల పెంపకం చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఇటు లక్షల్లో జీతాలు..అటు కోళ్ల పెంపకంతో మంచిగా సంపాదిస్తున్నారు.
 
హైదరాబాద్ శివారుల్లో కడక్ నాథ్ కోళ్ల పెంపెకం స్టార్ట్ చేసిన ఓ సాఫ్ట్ వేర్ యువకుల టీమ్ కు హైదరాబాద్ లో సొంతంగా ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉంది. 
 
వారానికి ఐదు రోజులు ఉద్యోగం.. మరో రెండు రోజులు ఖాళీగా ఉంటుంది. ఈ టైమ్ ను వేస్ట్ చేసుకోకుండా.. ఈ పాండమిక్ టైమ్‌లో వికారాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో 10 ఎకరాల వ్యవసాయ భూమిని కొనేసి.. 9 ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటి.. మరో ఎకరంలో ఒక షెడ్ ఏర్పాటు చేసి.. దాంట్లో కడక్ నాథ్ కోళ్ల పెంపకం చేపట్టారు. మొదట 500 కోళ్ల తో ప్రారంభించిన వీరి పెంపకం ఇప్పుడు దాదాపు ఆరు వేల కోళ్ల వరకూ పెంచుతున్నారు.
 
ఈ యువ సాఫ్ట్ వేర్ రైతులు కోళ్లను ఫ్రీరేంజ్ పద్ధతిలో పెంపకం చేపడుతున్నారు. స్థానిక పెరటి కోళ్ల మాదిరిగానే.. వీటి పోషణకు పెద్దగా ఖర్చు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒకరి తరువాత మరొకరు ఫామ్ లను పర్యవేక్షిస్తున్నారు. 
 
కోళ్ల తిండి ఖర్చు పెద్దగా పెరగకుండా చూసుకోవటానికి స్థానికంగా ఏండే రైతుల నుండి వేస్టేజ్ కూరగాయలు, ఆకు కూరలు సేకరించి కోళ్లకు ఆహారంగా వేస్తున్నారు. 
 
అంతే కాకుండా కోళ్ళను రోగనిరోధక శక్తిని పెంచేందుకు వేపాకు, కరివేపాకు, మునగాకును వేయడమే కాకుండా నీటిలో పసుపు, అల్లం, వెల్లుల్లి రసాన్ని కలుపుతున్నారు. 
 
మరోవైపు కోళ్లు పెట్టిన గుడ్లలో కొన్నింటిని మార్కెట్ చేసుకుంటూ మరికొన్నింటిని ఇంక్యూబేటర్ ద్వారా పిల్లల ఉత్పత్తి చేస్తూ మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇలా కడక్ నాథ్ కోళ్లు వీళ్లకు బంగారు గుడ్లు పెట్టేంత ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments