Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేడి నీటితో స్నానం చేస్తే కరోనా చెక్ : కేంద్రం క్లారిటీ

వేడి నీటితో స్నానం చేస్తే కరోనా చెక్ : కేంద్రం క్లారిటీ
, గురువారం, 13 మే 2021 (12:11 IST)
దేశాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ బారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ప్రజలు తమకు తోచిన విధంగా స్వీయరక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇందులోభాగంగా వేడి నీటితో స్నాం చేస్తే కరోనా రాదన్న ప్రచారం సాగుతోంది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చింది. ఈ ప్రచారంలో ఎంతమాత్రమూ నిజం లేదని తేల్చి చెప్పింది. ఇది పూర్తిగా వాస్తవ దూరమైన ప్రచారమని స్పష్టం చేసింది.
 
ప్రయోగశాలలో ప్రత్యేక పద్ధతుల్లో 60-75 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే వైరస్ మరణిస్తుందని తెలిపింది. అయితే, వేడినీళ్ల వల్ల శరీరానికి ఎంతో కొంత ఉపశమనం లభిస్తుందని వెల్లడించింది. వేడినీళ్ల స్నానం వల్ల ఒళ్లు నొప్పులు తగ్గుతాయని, మెదడు ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొంది. కండరాలకు, జాయింట్లకు రక్త సరఫరా అందుతుంది.
 
గొంతు నొప్పి తగ్గడానికి వేడి నీళ్లలో చిటికెడు ఉప్పు, పసుపు వేసుకుని పుక్కిలించడం వల్ల ఉపశమనం కలుగుతుందని ఆయుష్ శాఖ తెలిపింది. వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలో వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయని, కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని, జీర్ణవ్యవస్థ పెరుగుతుందని పేర్కొంది. 
 
అంతేకానీ వేడి నీళ్లు వల్ల కరోనా పోతుందన్న వార్తల్లో నిజం లేదని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంతోపాటు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడం ద్వారా మహమ్మారికి దూరంగా ఉండొచ్చని వివరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం జగన్ శుభవార్త, రైతు భరోసా ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.7,500