Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రామస్థులు మాట్లాడటం లేదనీ... ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి!

Advertiesment
గ్రామస్థులు మాట్లాడటం లేదనీ... ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి!
, గురువారం, 13 మే 2021 (09:41 IST)
కరోనా సోకిందన్న అనుమానంతో గ్రామస్థులంతా తనతో మాట్లాడకపోవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం జైకేసారంలో గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన 38 యేళ్ల ఓ వ్యక్తి భార్య, పదేళ్ల కుమారుడికి పది రోజుల క్రితం కరోనా సోకింది. ఆయనకు కూడా లక్షణాలు ఉండటంతో రెండుసార్లు పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌ వచ్చింది. 
 
అయితే, గ్రామస్థులు మాత్రం.. ఆయనకు కూడా కరోనా సోకిందనే అనుమానంతో స్థానికులు ఎవరూ మాట్లాడటం మానేశారు. మంగళవారం రాత్రి తీవ్రమైన దగ్గు, ఆయాసం రావడంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం తెల్లవారుజామున బయటకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరాడు. 
 
వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు గమనించి చౌటుప్పల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. వైద్యులు కరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌ వచ్చింది. మృతుడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య, కుమారుడు ప్రస్తుతం హోం ఐసొలేషన్‌లో ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బడ్జెట్ ఆమోదం కోసం.. ఒక్క రోజు అసెంబ్లీ సమావేశాలు!