బేగంబజార్‌ పరువు హత్యకేసు-ఐదుగురు అరెస్ట్.. 2 నెలల బిడ్డతో రోడ్డుపై భార్య

Webdunia
శనివారం, 21 మే 2022 (16:02 IST)
హైదరాబాద్ బేగంబజార్‌ పరువు హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. నీరజ్‌ పర్వాన్‌‌ను హత్య చేసిన ఐదుగురు నిందితులను  వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య అనంతరం కర్నాటకకు పారిపోయిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతో నీరజ్‌పై దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. నీరజ్‌ పన్వార్‌ను దాదాపు 20 సార్లు కత్తులతో పొడిచి చంపారు. పక్కా ప్లాన్ ప్రకాం నడిరోడ్డుపై యువకుడిని అడ్డగించి కత్తులతో పొడిచి హత్య చేశారు. 
 
ఈ ఘటనపై టాస్క్‌ఫోర్స్‌ సహా నాలుగు బృందాలతో దర్యాప్తు కొనసాగింది. 10 మందిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
మరోవైపు బేగంబజార్‌లోని పరువు హత్య కేసులో.. మృతుడు నీరజ్ భార్య సంజన ధర్నా చేపట్టింది. రెండు నెలల కుమారుడితో బంధువులతో కలిసి ధర్నాకు దిగింది. 
 
తన భర్తను చంపిన వారిని ఉరి తీయాలంటూ డిమాండ్ చేసింది. తన సోదరులే నీరజ్‌ను చంపారని, ఏడాది కాలంగా చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఆమె చెప్పింది. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా వారు పెడచెవిన పెట్టారని, ఇప్పుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం