Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్‌లో డ్రగ్స్ వ్యవహారం.. ఆ ఇద్దరిని పట్టుకునేందుకు..?

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2022 (12:46 IST)
హైదరాబాద్‌లోని పబ్‌లో డ్రగ్స్ వ్యవహారం బట్టబయలైన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ వ్యవహారంలో కీలక విషయాలు బయటకొస్తున్నాయి.
 
పబ్‌లో దాడుల సందర్భంగా డ్రగ్స్‌తో పాటు హాష్ ఆయిల్ సిగరెట్లు, గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో హాష్ ఆయిల్ సిగరెట్లను రూ.8 వేల చొప్పున విక్రయించినట్లు గుర్తించారు. 
 
మరోవైపు, ఈ కేసులో పరారీలో ఉన్న ఏ3 అర్జున్, ఏ4 కిరణ్ రాజ్‌లను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఇద్దరు విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
 
ఈ క్రమంలో ఇటీవల కిరణ్ రాజు నుంచి పోలీసులకు ఒక ఈమెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. పబ్‌లో డ్రగ్స్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని... పబ్‌లో వ్యాపార భాగస్వామిని మాత్రమేనని కిరణ్ రాజు అందులో వెల్లడించినట్లు తెలుస్తోంది.
 
కాగా, ఏప్రిల్ 3 తెల్లవారుజామున 3 గంటల సమయంలో పుడింగ్ అండ్ మింక్ పబ్‌పై పోలీసులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. దాడుల సమయంలో దాదాపు 150 మంది యువతీ యుకులు పట్టుబడ్డారు. పబ్‌లో డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments