Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కొడుక్కే చలానా రాస్తారా? ఠాణాలకు కరెంట్ సరఫరా నిలిపివేత.. ఎక్కడ?

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (09:41 IST)
మైనర్ బాలుడు ద్విచక్రవాహనాన్ని నడిపినందుకు ట్రాఫిక్ పోలీసులు చలానా రాశారు. ఈ విషయం ఆ మైనర్ బాలుడి తండ్రికి తెలిసింది. అంతే.. ఆయన ఒంటికాలిపై ట్రాఫిక్ పోలీసులపై నోరుపారేసుకున్నాడు. అంతటితో సరిపెట్టుకున్నారంటే అదీలేదు.. ఏకంగా రెండు పోలీస్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ ఘటన జీడిమెట్లలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జీడిమెట్ల ట్రాఫిక్‌ ఎస్‌ఐ రమేష్‌ విధి నిర్వహణలో భాగంగా మంగళవారం సాయంత్రం షాపూర్‌నగర్‌లో వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో ద్విచక్రవాహనంపై అటుగా వచ్చిన మైనర్‌ ద్విచక్ర వాహనాన్ని ఆపారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదని గుర్తించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని బాలుడిని పంపించారు. 
 
అయితే, ఈ బాలుడు తండ్రి జీడిమెట్ల విద్యుత్‌ శాఖలో కాంట్రాక్టు కార్మికుడు (ఆర్టీజెన్‌)గా పని చేస్తున్నాడు. ఆ బాలుడు నేరుగా జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పారు. ఆయన తన పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో... బాలుడు తండ్రి తమ శాఖలో పని చేస్తున్నారనీ, బండిని వదిలేయాలని ఫోన్లో అధికారులను కోరాడు. 
 
ఈ విషయంలో తామేమీ చేయలేమని, చలాన్‌ కూడా రాశామని చెప్పడంతో ఆర్టీజెన్‌ కోపంతో ఊగిపోయాడు. 'మాకు సాయం చేయరా.. మీ సంగతి చెప్తా' అంటూ ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండానే మంగళవారం సాయంత్రం ఆరు దాటాక ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌, గాజులరామారం కార్యాలయాల విద్యుత్‌ సరఫరాను నిలిపివేశాడు. 
 
రెండు గంటల పాటు పోలీస్‌స్టేషన్‌లు అంధకారంలో ఉన్నాయి. జీడిమెట్ల సీఐ బాలరాజు విద్యుత్‌ డీఈ రాజుతో మాట్లాడి విద్యుత్‌ పునరుద్ధరణ జరిగేలా చర్యలు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments