Webdunia - Bharat's app for daily news and videos

Install App

నక్షత్ర హోటల్‌లో రేవ్ పార్టీ... ఇద్దరు మహిళలతో సహా 8 మంది అరెస్టు

Webdunia
సోమవారం, 6 జులై 2020 (09:18 IST)
హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య విచ్చలవిడిగా నమోదవుతున్నాయి. దీంతో లాక్డౌన్ నిబంధనలను కఠనంగా అమలు చేస్తున్నారు. అయితే, కొందరు బడా వ్యాపారులు మాత్రం ఈ లాక్డౌన్ నిబంధనలకు తూట్లు పొడుస్తూ జల్సాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ పబ్ యజమాని తన పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రముఖ నక్షత్ర హోటల్‌లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఇందులో ఇద్దరు మహిళలతో పాటు.. మొత్తం 8 మందిని పాల్గొనగా, వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ నక్షత్ర హోటల్‌లో ఓ పబ్ యజమాని తన పుట్టిన రోజు సందర్భంగా రేవ్ పార్టీని ఏర్పాటు చేశారు. దీనికి తన స్నేహితులను ఆహ్వానించగా, మొత్తం 8 మంది పాల్గొన్నారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. 
 
ఈ క్రమంలో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పోలీసులు... పెట్రోలింగ్ విధుల్లో ఉండగా, ఈ రేవ్ పార్టీ గురించి సమాచారం అందింది. దీంతో అర్థరాత్రి హోటల్‌లో ఆకస్మిక తనిఖీలు చేసి రేవ్ పార్టీ వ్యవహారాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలో పార్టీలో పాల్గొన్న ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అంతేకాకుండా, వీరంతా లాక్డౌన్ రూల్స్‌కు వ్యతిరేకంగా రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు తేలడంతో వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments