Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫార్మా కంపెనీపై ఐటీ విభాగం దాడులు.. వామ్మో బీరువా నిండా కరెన్సీ కట్టలే!

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (13:32 IST)
currency
హైదరాబాద్ ఆధారిత అతిపెద్ద ఫార్మా కంపెనీపై ఐటీ విభాగం దాడులు నిర్వహించింది. రూ .142 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. భారీ పెట్టుబడితో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఫార్మా మేజర్ హెటిరో ఫార్మాస్యూటికల్‌పై దాడులు చేసిన అనంతరం.. ఆదాయపు పన్ను శాఖ రూ .550 కోట్ల లెక్క చూపని ఆదాయాన్ని గుర్తించింది. రూ .142 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. 
 
మూలాల ప్రకారం, అక్టోబర్ 6న ఈ దాడులు జరిగాయి. ఇందులో  గుర్తించబడని ఆదాయానికి రైడ్‌లో నగదును గుర్తించారు. కంపెనీకి సంబంధించి మొత్తం 16 బ్యాంకు లాకర్లతో పాటు.. ఇప్పటి వరకు లెక్కల్లో చూపని 550 కోట్ల రూపాయల ఆదాయం గుర్తించినట్లు ఐటీ శాఖ వెల్లడించింది.
 
ఈ దాడులకు సంబంధించి ఓ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకు ఆ ఫోటోలో ఏం ఉందంటే బీరువా. బట్టలు పెట్టుకునే బీరువా ఫోటో వైరల్‌ కావడం ఏంటంటే.. మనలాంటి సామాన్యులు బీరువాలో బట్టలు పెడతారు.. కానీ సదరు ఐటీ కంపెనీ బీరువాను డబ్బు కట్టలతో నింపింది. ఎక్కడా కొంచెం కూడా ఖాళీ లేకుండా డబ్బు కట్టలను బీరువా నిండ పేర్చింది.
 
ఈ ఫోటో చూసిన నెటిజనులు వార్నీ మా బీరువాలో బట్టలు సర్దిని తరువాత కూడా చాలా ఖాళీ ప్లేస్‌ ఉంటుంది.. ఇదేందిరా నాయనా ఇన్ని డబ్బు కట్టలు.. అబ్బ ఒక్క కట్ట నాకు దొరికితే లైఫ్‌ సెటిల్‌ అవుతుంది.. నోట్ల రద్దు ఫలించలేదు.. నోట్ల రంగు ఆకారం మారింది అంతే.. అరే 2000 రూపాయల నోట్లు వాడి ఉంటే.. 75 శాతం జాగా మిగిలేది.. మరిన్ని డబ్బులు దాచుకోవడానికి అవకాశం ఉండేది అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజనులు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments