Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ కోసం యాచకుల మధ్య కీచులాట.. ఒకరు హత్య!

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (16:54 IST)
హైదరాబాద్ నగరంలో ఓ మహిళ కోసం ఇద్దరు యాచకులు గొడవకు దిగారు. ఈ గొడవ కాస్త చిలికి చిలికి గాలివానలా మారి ఓ భిక్షగాడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో హైదరాబాద్ నగర పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ నాగరాజు వెల్లడించిన వివరాల మేరకు... సర్దార్‌(35), ఖాజా పాషా(40) అనే ఇద్దరు యాచకులు ఫుట్‌పాత్‌పై ఉంటూ ప్రతిరోజూ యాచకవృత్తి చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఓ యాచకురాలి (మహిళ) కుమారుడు ఏడాదిన్నర బాలుడు ఇటీవల కిడ్నాపయ్యాడు. బాలుడిని కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి చిన్నారిని తల్లికి అప్పగించారు. 
 
ఆ సమయంలో ఇద్దరు యాచకులు ఆ మహిళ వెంట ఉన్నారు. యాచకులిద్దరూ ఆమెపై మనసుపడ్డారు. దీంతో ఆమె కోసం పాషా, సర్ధార్‌ ఆదివారం అర్థరాత్రి గొడవపడ్డారు. సంతోష్‌ అనే వ్యక్తితో కలిసి పాషా... సర్దార్‌ను పిడిగుద్దులు గుద్దడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. 
 
ఈ విషయం స్థానిక పోలీసుల దృష్టికి చేరడంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు... సర్దార్‌ హత్యకు కారకుడైన పాషాతోపాటు సహకరించిన సంతోష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments