Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్టర్ ట్రంప్.. నోరు మూసుకో... : హ్యూస్టన్ సిటీ పోలీస్ చీఫ్

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (16:34 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు హ్యూస్టన్ నగర పోలీసు చీఫ్ ఆర్ట్ అసేవెడో గట్టి వార్నింగ్ ఇచ్చారు. అమెరికా దేశంలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని మిన్నియా పోలీస్ అధికారి ఒకరు ఉద్దేశ్యపూర్వకంగా హత్య చేశాడు. దీంతో దేశంలో అల్లర్లు చెలరేగాయి. వీటిని అణిచివేసేందుకు సైన్యాన్ని దించుతానంటూ అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీచేశారు. వీటిపై హ్యూస్టన్ నగర పోలీస్ చీఫ్ అసేవెడో హెచ్చరించారు. 
 
ట్రంప్‌ నోరు మూసుకోవాలంటూ సూచన చేశారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల నిరసనకారుల ఆగ్రహం ఇంకా పెరుగుతుందని, ఇలా వ్యాఖ్యలు చేయడం వారిని రెచ్చగొట్టడమే అవుతుందన్నారు. నిరసనకారులను రెచ్చగొట్టకుండా ట్రంప్‌ నోరు మూసుకొని ఉంటే పదివేలని సూచించారు. ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడటానికి బదులుగా ఏదైనా నిర్మాణాత్మక కార్యక్రమం ప్రకటిస్తే బాగుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఫారెస్ట్‌ గంప్‌ సినిమాలోని 'మీకు చెప్పడానికి ఏమీ లేకపోతే.. చెప్పకండి' అనే డైలాగ్‌ను అసేవెడో ఉటంకించారు. 
 
ఇదిలావుంటే, సోమవారం వివిధ రాష్ట్రాల గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ట్రంప్‌.. అక్కడ కూడా ఇదే మాదిరి వ్యాఖ్యలు చేశారు. 'మీరు చాలా బలహీనంగా ఉన్నారు.. నిరసనకారులపై పైచేయి అనిపించుకోండి.. లేకపోతే ఇదంతా సమయం వృథా చేయడమే.. మీరిలాగే ఉంటే వారు మీపైకెక్కి నాట్యం చేస్తారు' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments