Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నాన్న కూతురిపై 6 నెలల పాటు అత్యాచారం.. మైనర్ గర్భం దాల్చడంతో...?

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (14:14 IST)
కామాంధులు వావి వరసులు మరిచిపోతున్నారు. వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా విచక్షణ మరిచి వరుసకు చెల్లెలు వరసయ్యే బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో చోటుచేసుకుంది. ఆరు నెలలుగా లైంగిక దాడి చేస్తుండగా బాలిక గర్భం దాల్చడంతో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. వావివరసలను మరిచి మైనర్ అయ్యే చెల్లెలిపై కామాంధుడు కన్నేశాడు. ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు కన్నాయిగూడెం మండలం వాసంపల్లిలో చంటి(28) అనే యువకుడని తేలింది. ఇతని పెళ్లై.. భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
ఈ కామాంధుడి కళ్లు తన సొంత చిన్నాన్న కూతురిని వేధించి, బెదిరించి తన కామవాంఛను తీర్చుకుంటున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరింపులకు గురి చేశాడని, తన తల్లిదండ్రులనూ హతమారుస్తాన, ఇల్లు తగల పెడతానని భయపెట్టినట్లు బాలిక తెలిపింది.
 
మూడు రోజుల క్రితం ఆ బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేయించగా... గర్భం దాల్చినట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు ఆ బాలికను నిలదీయడంతో బాలిక అసలు విషయం చెప్పింది. 
 
బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టిన పోలీసులు ఫోక్సో చట్టం, 376 సెక్షన్ కింద కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం