Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫైన్ కట్టమన్న ట్రాఫిక్ పోలీసులు.. బైక్‌కు నిప్పంటించిన వ్యక్తి

Webdunia
బుధవారం, 21 జూన్ 2023 (09:31 IST)
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ ఫసీయుద్దీన్‌(35) వ్యాపారి. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ మూడేళ్లలో 28 సార్లు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించాడు. మంగళవారం ఆర్జీఐఏ ట్రాఫిక్‌ ఎస్సై శంకర్‌ ఆధ్వర్యంలో కిషన్‌గూడ పైవంతెన వద్ద వాహనాల తనిఖీలో భాగంగా అతని వాహనాన్ని ఆపారు. దానికున్న పెండింగ్‌ చలాన్లను పరిశీలించగా రూ.9,110 జరిమానా ఉన్నట్లు తేలింది. 
 
ఈ చలాన్లు చెల్లించి వాహనం తీసుకెళ్లాలని సూచించిన పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన ఫసీయుద్దీన్‌ తన వాహనం పెట్రోల్‌ ట్యాంక్‌ తెరిచి నిప్పంటించడంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన ట్రాఫిక్‌ పోలీసులు మంటలను ఆర్పివేశారు. ఫసీయుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఆర్జీఐఏ పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments