Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ గేమ్ వ్యసనం... అమ్మ తిట్టిందనీ ఆత్మహత్య

Webdunia
బుధవారం, 21 జూన్ 2023 (09:11 IST)
నెల్లూరు జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన ఓ విద్యార్థిని.. కాలేజీ ఫీజు కట్టేందుకు తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులను గేమ్‌లో పోగొట్టుకుంది. ఈ విషయం తెలిసిన తల్లి కుమార్తెను మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన కుమార్తె బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని దుత్తలూరు మండలం తురకపల్లి గ్రామానికి చెందిన పోలు కవిత అనే విద్యార్థిని బీఫార్మసీ చదువుతుంది. 20 యేళ్ల కవిత నెల్లూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తుంది. అయితే, ఆన్‌లైన్ గేమ్‌లకు బాగా అలవాటుపడిన కవిత.. కాలేజీ ఫీజు కట్టమని తల్లిదండ్రులు ఇచ్చిన రూ.2.50 లక్షల డబ్బును గేమ్‌లలో పోగొట్టుకుంది. 
 
ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కష్టపడి సంపాదించిన డబ్బును ఇలా ఆన్‌లైన్ గేమ్‌ వ్యసనంతో నాశనం చేశావంటూ కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తల్లిదండ్రులు తిట్టారన్న మనస్తాపంతో ఐదు రోజుల క్రితం కవిత పురుగుల మందు తాగింది. 
 
ఆ తర్వాత ఆమెను ఆస్పత్రికి చేర్చగా, చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. మరోవైపు, ఎదిగివచ్చిన కుమార్తె ఇలా అర్థంతరంగా తనవు చాలించడంతో ఆమె తల్లిందడ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూఫోరియా మ్యూజికల్ నైట్ లో ప్రతి ఒక్క రూపాయి సమాజ సేవకే : నారా భువనేశ్వరి

పుష్ప 2 కలెక్షన్స్ రూ. 1850 కోట్లు వచ్చాయా? లెక్కలేవీ అని ఐటీ అడిగిందా?

హాసం రాజా ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణ

విశ్వక్సేన్, లైలా సెకండ్ సింగిల్ ఇచ్చుకుందాం బేబీ రాబోతుంది

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో సత్యరాజ్, ఉదయ భాను చిత్రం బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments