పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 100 శాతం కామెడీయేనని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి కమెడియన్ అయ్యాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ ఒక సినిమాకు రూ.100 కోట్లు తీసుకుంటాడు... ఆయనను కామెడీ అంటున్నారనే ప్రశ్నకు అంబటి సమాధానం ఇచ్చారు.
ఒక సినిమాకు కోట్లు తీసుకోవడం గొప్పేమీ కాదని, కమెడియన్ బ్రహ్మానందం కూడా ఒక సినిమాకు 30 రోజులు కాల్షీట్స్ ఇచ్చి, రోజుకు లెక్కగట్టి కోట్లు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని అంబటి వివరించారు. బ్రహ్మానందం సినిమాల్లోనే కమెడియన్ రియల్ లైఫ్‌లో సీరియస్ అయిన వ్యక్తి అంటూ అంబటి కితాబిచ్చారు.
జీవితంలో చాలా తెలిసిన వ్యక్తి బ్రహ్మానందం. పవన్ కంటే చాలా మేధావి బ్రహ్మానందం. హాస్యబ్రహ్మ అనేక పుస్తకాలు చదివారు... రామాయణం, వేదాల గురించి అనర్గళంగా మాట్లాడగలరు అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.