Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముందు నీ బాధ తీరుస్తా - తర్వాత సంగతి తర్వాత : పవన్ కళ్యాణ్

pawan kalyan
, ఆదివారం, 18 జూన్ 2023 (11:39 IST)
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఓ వికలాంగుడి కష్టాలు ఆలకించిన జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఈ సందర్భంగా ఆ వికలాంగుడు.. అన్నా నువ్వు సీఎం కావాలన్నా అని కోరగా... ముందు నీ బాధ తీరుస్తా.. తర్వాత సంగతి తర్వాత అని సమాధానమిచ్చారు. జిల్లా కేంద్రమైన కాకినాడలో ఆయన శనివారం జనవాణి కార్యక్రమం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఓ దివ్యాంగుడు వేదన విని చలించిపోయారు. పెన్షన్ అందలేదని, బతుకు దుర్భరంగా మారిందని వీల్ చెయిర్‌లో కూర్చొన్న ఆ దివ్యాంగుడు పవన్ దృష్టికి తెచ్చారు. ఆ దివ్యాంగుడి బాధలు విని చలించిపోయిన పవన్ కళ్యాణ్ అతడిని హత్తుకుని తప్పకుంటా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆ దివ్యాంగుడు నువ్వు సీఎం కావాలన్నా అని తన మనసులోని మాటను బయటపెట్టాడు. అందుకు ఆ పవన్ స్పందిస్తూ, ముందు నీ బాధ తీరుస్తా.. తర్వాత సంగతి తర్వాత.. అంటూ బదులిచ్చి, అక్కడ నుంచి పవన్ నిష్క్రమించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లంచం కేసులో తెలంగాణ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ అరెస్టు