Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్య నాపై కేసు పెట్టింది.. ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది.. రండి సార్ చూపిస్తా..?

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (13:06 IST)
హైదరాబాద్.. రామాంతపూర్‌కు చెందిన వ్యక్తి పదే పదే పోలీసుల వద్దకు వెళ్లాడు. తన భార్య మోసం చేసిందని గృహ హింస కేసు పెట్టిందని.. ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ.. తనను కేసులో ఇరికించిందని పోలీసులకు చెప్పాడు. ఇంకా తనతో ఇంటికి రండి.. ఆ తతంగాన్ని చూపిస్తానన్నాడు. అంతే అతను చెప్పేది ఎందుకో పోలీసులకు నమ్మాలనిపించింది. సరే పద అంటూ అతనితో వెళ్లారు. 
 
ఇంటికి వెళ్లిన పోలీసులకు షాక్ తప్పలేదు. బాధిత వ్యక్తి చెప్పినట్లే.. అతడి భార్య మరో వ్యక్తితో సరససల్లాపాల్లో ఉంది. డోర్ కొట్టగానే వాళ్లిద్దరూ షాక్ అయ్యారు. తీరా విచారిస్తే.. భర్తపై కేసు పెట్టి ప్రియుడితో ఆ మహిళ ఎంజాయ్ చేస్కున్నట్లు తేలింది. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి నీళ్లు నములుతూ... భయపడుతూ కనిపించాడు. 
 
"ఏమ్మా... ఇతను నీ భర్తేనా" అని అడిగారు పోలీసులు. అవునంది. "ఇతనిపై నువ్వు గృహ హింస కేసు పెట్టావా" అని అడిగారు. పెట్టానని చెప్పింది. తాను సిటీలోని ఆ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపింది. 
 
ఇలా చేయడం మంచిది కాదని భర్త మందలించడంతో అతనిపై ఐపీసీ సెక్షన్ 498(A) కింద గృహ హింస కేసు పెట్టినట్లు వెల్లడి అయ్యింది. ఇకపోతే.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితుడి భార్య, మరో వ్యక్తినీ అదుపులోకి తీసుకొని... పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఇరువైపులా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments