Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెండింగ్‌లో కేసులో తీర్పు జాప్యం : హైకోర్టులో మహిళ ఆత్మహత్యాయత్నం

Advertiesment
పెండింగ్‌లో కేసులో తీర్పు జాప్యం : హైకోర్టులో మహిళ ఆత్మహత్యాయత్నం
, మంగళవారం, 6 అక్టోబరు 2020 (14:31 IST)
హైదరాబాద్ హైకోర్టులో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పెండింగ్‌లో ఉన్న ఓ కేసులో తుది తీర్పు రావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీన్ని భరించలేని ఆ మహిళ బలవన్మరణానికి పాల్పడేందుకు ప్రయత్నించింది. ఈమె హైకోర్టు భవనంలోని మొదటి అంతస్థు నుంచి కిందకి దూకేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన సెక్యురిటీ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గోదావరి ఖనికి చెందిన కవిత అనే మహిళకు సంబంధించిన కేసు ఒకటి హైకోర్టులో ఉంది. ఈ కేసు చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉండటం... రోజులు గడుస్తున్నా తీర్పు రాకపోవడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది. 
 
దీంతో హైకోర్టు ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకేందుకు ప్రయత్నించింది. కవితను అడ్డుకున్న హైకోర్టు సెక్యూరిటి సిబ్బంది... సెక్యూరిటీ కార్యాలయంలో కూర్చోబెట్టి విచారిస్తున్నారు. ఈ యేడాది ఏప్రిల్ 11వ తేదీన మురళీ అనే వ్యక్తి హత్యాచారం చేశాడని విచారణలో పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫెరారో ఇండియా “కిండర్‌ క్రీమీ” లాంచ్‌