ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2023 కోసం సిద్ధమైన హైదరాబాద్‌, నవంబర్‌ 15 లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే 25% డిస్కౌంట్

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (15:53 IST)
ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ ఇప్పుడు రన్నర్లకు జీవితకాలపు అనుభవాలను అందిస్తూ మూడవ ఎడిషన్‌ ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2023 నిర్వహణ కోసం సిద్ధమైంది. ఈ రన్‌ను 29 జనవరి 2022వ తేదీన నిర్వహించబోతుంది. ఈ రన్‌ కోసం రిజిస్ట్రేషన్లు ఇప్పుడు తెరుచుకున్నాయి. నవంబర్‌ 15, 2022వ తేదీ లోపుగా రన్‌ కోసం నమోదు చేసుకునే వారికి 25% వరకూ ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌ను సైతం అందించనున్నారు. తద్వరా 5కె రన్‌ కోసం 699 రూపాయలు, 10 కిలోమీటర్ల పరుగుకు 1199 రూపాయలు, 21 కిలోమీటర్ల రన్‌కు 1499 రూపాయలు (జీఎస్‌టీతో కలిపి) చెల్లిస్తే సరిపోతుంది.

 
ఈ మారథాన్‌ ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ వద్ద ప్రారంభమవుతుంది. ఈ రన్‌ హైదరాబాద్‌లో అత్యంత అందమైన ల్యాండ్‌మార్క్‌ అయిన దుర్గం చెరువు బ్రిడ్జ్‌పై సాగుతుంది. ఈ రన్‌లో పాల్గొనేవారు తమ బిబ్స్‌పై పేర్లను సైతం తాము కోరుకున్నట్లుగా పొందవచ్చు. ఈ రన్‌లో నమోదు చేసుకున్న వారందరూ 1500 రూపాయల ఖచ్చితమైన బహుమతితో పాటుగా టీ షర్ట్‌, గుడీస్‌ బ్యాగ్‌ను సైతం పొందవచ్చు.

 
ఈ మారథాన్‌ను ప్రొఫెషనల్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఎన్‌ఈబీ స్పోర్ట్స్‌ నిర్వహిస్తుంది. చక్కటి ఆరోగ్యం కోసం పరుగు అని ఈ కంపెనీ ప్రచారం చేస్తుంది. సేవా రంగంలో దివ్యాంగులకు  ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటుగా నైపుణ్యాభివృద్ధి అందించే దిశగా ఈ మారథాన్‌ నిర్వహిస్తున్నారు. ఎన్‌జీఓ నిర్మాణ్‌ దీనికి చారిటీ భాగస్వామిగా వ్యవహరిస్తుంది.

 
ఈ సంవత్సర జనవరిలో, ఈ మాల్‌ విజయవంతంగా రెండవ ఎడిషన్‌ ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2022ను నిర్వహించింది. ఈ రన్‌లో 3200 మంది వ్యక్తులతో సహా 90 మంది దివ్యాంగులు పాల్గొన్నారు. మొత్తంమ్మీద 30 లక్షల రూపాయలను దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగావకాశాల కోసం సమీకరించారు. ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2023ను కోవిడ్‌ 19 స్పోర్ట్స్‌ సేఫ్టీ ప్రమాణాలను అనుసరిస్తూ నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karva Chauth: చంద్రుడంత ప్రకాశవంతమైన ప్రేమ వరుణ్ తేజ్ ది : లావణ్య త్రిపాఠి

Priyadarshi: మిత్ర మండలి చిత్రం సెన్సార్ పూర్తి.. యు/ఎ సర్టిఫికెట్

Rashmika: వజ్రపు ఎంగేజ్‌మెంట్ ఉంగరం మెరిసిపోతుందిగా.. రష్మిక మందన అలా దొరికిపోయింది.. (video)

Vijay Deverakonda: ఈనెలలోనే విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ చిత్రం రెగ్యులర్ షూటింగ్

Vijaya Setu: విజయసేతుపై డాక్టర్ రమ్య మోహన్ పెట్టిన పోస్ట్ మళ్ళీ వైరల్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments