Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా ఏఎస్పీ అధికారిణితో సీఐ రాసలీలలు... చెప్పుతో కొట్టారు, కేసు నమోదు

రక్షణ కల్పించాల్సిన పోలీసులే రోడ్డున పడ్డారు. తన భార్యతో కల్వకుర్తి సీఐ మల్లికార్జున్ రెడ్డి అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ విభాగంలో ఏఎస్పీగా పనిచేస్తున్న అధికారిణితో సీఐ మల్లికార్జున రెడ్డిల మధ్య వివాహేతర బంధం బట

Webdunia
సోమవారం, 22 జనవరి 2018 (20:31 IST)
రక్షణ కల్పించాల్సిన పోలీసులే రోడ్డున పడ్డారు. తన భార్యతో కల్వకుర్తి సీఐ మల్లికార్జున్ రెడ్డి అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ విభాగంలో ఏఎస్పీగా పనిచేస్తున్న అధికారిణితో సీఐ మల్లికార్జున రెడ్డిల మధ్య వివాహేతర బంధం బట్టబయలై, హైదరాబాద్, కేపీహెచ్‌బి కాలనీలో కలకలం రేపింది.
 
వివరాల్లోకి వెళితే.. ఏసీబీలో ఏఎస్పీగా పనిచేస్తున్న తన భార్యను, సీఐని రెడ్ హ్యాండెడ్‌గా అధికారిణి భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. సీఐపై చెప్పులతో దాడి చేశారు. నడిరోడ్డుపైనే సీఐని చితక్కొట్టాడు. ఏఎస్పీ తల్లి, అత్త ఇద్దరూ కలసి మల్లికార్జున్ రెడ్డిని చెప్పులతో కొట్టారు. ఈ మొత్తం వ్యవహారమంతా టీవీ చానల్ కెమెరాలకు చిక్కింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ వ్యవహారాన్ని తెలుసుకున్న ఉన్నతాధికారులు ఏఎస్పీ, సీఐల వైఖరిపై సీరియస్‌ అయ్యారు. తన భార్యను సీఐ ట్రాప్ చేశాడని, గత రెండేళ్లుగా వారిద్దరి మధ్య సంబంధం ఉందని ఏఎస్పీ భర్త ఆరోపించాడు. తను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, అయితే తన భార్య బాగోతం బయట పెట్టాలనే ఉద్దేశంతోనే వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని చెప్పాడు. వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశాడు. కాగా సీఐ మల్లికార్జున్ రెడ్డిపై 447, 497, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments