Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిత్తూరులో యువతిని బట్టలిప్పి నడిరోడ్డుపై కొట్టిన మహిళలు.. అసలు కారణమిదేనంట...

సభ్యసమాజం తలదించుకోవాల్సిన సంఘటన ఇది. తన భర్తతో ఒక యువతి అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ ఒక మహిళ మరో ముగ్గురు మహిళలను వెంటపెట్టుకుని వెళ్ళి గొడవ పెట్టుకుంది. అంతటితో ఆగలేదు యువతిని వివస్త్రను చేసి నడిరోడ్డుపైనే కొట్టారు. చిత్తూరు జిల్లాలో జరిగిన

చిత్తూరులో యువతిని బట్టలిప్పి నడిరోడ్డుపై కొట్టిన మహిళలు.. అసలు కారణమిదేనంట...
, గురువారం, 18 జనవరి 2018 (21:23 IST)
సభ్యసమాజం తలదించుకోవాల్సిన సంఘటన ఇది. తన భర్తతో ఒక యువతి అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ ఒక మహిళ మరో ముగ్గురు మహిళలను వెంటపెట్టుకుని వెళ్ళి గొడవ పెట్టుకుంది. అంతటితో ఆగలేదు యువతిని వివస్త్రను చేసి నడిరోడ్డుపైనే కొట్టారు. చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 
 
శాంతిపురం మండలం గుంజార్లపల్లికి చెందిన సుబ్రమణ్యం, భాగ్యలక్ష్మిలు భార్యాభర్తలు. సుబ్రమణ్యంకు అదే గ్రామానికి చెందిన ఉమాదేవితో అక్రమ సంబంధం వుందన్న ఆరోపణలున్నాయి. గత కొన్నిరోజులుగా ఉమాదేవితో సుబ్రమణ్యం కలిసి ఉండడాన్ని జీర్ణించుకోలేకుండా పోయింది భాగ్యలక్ష్మి. భర్తకు ఎంత నచ్చజెప్పినా పట్టించుకోలేదు. అంతేకాదు ఉమాదేవికి ఆస్తి ఇవ్వడానికి కూడా సిద్థమయ్యాడు సుబ్రమణ్యం. 
 
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భాగ్యలక్ష్మి, తన భర్త సుబ్రమణ్యం ఊర్లో లేని సమయంలో ఉమాదేవి ఇంటికి వెళ్ళి ఆమెతో గొడవ పెట్టుకుని రోడ్డుపైకి లాక్కుని వచ్చి బట్టలు విప్పతీసింది. తన వెంట వచ్చిన మరో ముగ్గురు మహిళలు కూడా భాగ్యలక్ష్మికి సహాయం చేశారు. దీనిపై ఉమాదేవి పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేయలేదు. తనకు న్యాయం కావాలంటూ పోలీస్టేషన్ ముందు ఉమాదేవి ఆందోళన చేపట్టింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతడికి లైంగిక పటుత్వం వుందన్న నివేదిక... బెయిల్ మంజూరు