Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకుని తొలిరాత్రి భార్యతో గడిపాడు... నువ్వు నాకొద్దంటూ విడాకులు... ఏం జరిగింది?

పెళ్లిళ్లు పెటాకులవుతున్న సందర్భాలు ఈమధ్య ఎక్కువగా కనబడుతున్నాయి. విడాకులు తీసుకోవడం అనేది చాలా సింపుల్‌గా మారిపోయింది. సహజీవనం, రెండో పెళ్లి తదితర వ్యవహారాలు ఇప్పుడు మామూలుగా మారిపోయాయి. ఇక అసలు విషయానికి వస్తే... తన మొదటి భార్యను ఒప్పించి మరో మహిళన

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (16:48 IST)
పెళ్లిళ్లు పెటాకులవుతున్న సందర్భాలు ఈమధ్య ఎక్కువగా కనబడుతున్నాయి. విడాకులు తీసుకోవడం అనేది చాలా సింపుల్‌గా మారిపోయింది. సహజీవనం, రెండో పెళ్లి తదితర వ్యవహారాలు ఇప్పుడు మామూలుగా మారిపోయాయి. ఇక అసలు విషయానికి వస్తే... తన మొదటి భార్యను ఒప్పించి మరో మహిళను వివాహం చేసుకున్న ఓ పురుషుడు, రెండో భార్యతో ఒకే ఒక్కరోజు గడిపి ఇక ఆమె తనకు అక్కర్లేదనుకున్నాడు. పోస్టులో విడాకులు పత్రం పంపించి, తను విడిపోవాలనుకుంటున్నట్లు తెలిపాడు.
 
వివరాల్లోకి వెళితే... హైద‌రాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రకాశం పంతులు నగర్‌ ప్రాంతంలో 38 ఏళ్ల మహ్మద్ హనీఫ్, 32 ఏళ్ల బహదురున్నీసా దంపతులున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. కానీ హనీఫ్ కు మాత్రం అబ్బాయి కావాలని గోల చేయడం మొదలుపెట్టాడు. మరోవైపు భార్య గర్భస్రావం కావడంతో ఇక ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. దీనితో అతడు ఓ నిర్ణయానికి వచ్చాడు. మరో యువతిని రెండో పెళ్లి చేసుకుని ఆమె ద్వారా అబ్బాయిని కంటానని భార్యను ఒప్పించాడు. ఆమె ఒప్పుకోగానే తలాబ్‌కట్టా ప్రాంతానికి చెందిన ఫర్హీన్‌ను పెళ్లాడాడు. ఆమెను పెళ్లాడేటపుడు మొదటి భార్య నుంచి విడాకులు తీసుకుంటానని వారికి చెప్పాడు. 
 
అలా పెళ్లాడిన రెండో భార్యను తెచ్చి కూకట్ పల్లిలో పెట్టి ఆమెతో తొలిరాత్రి గడిపాడు. తెల్లారేసరికి పత్తా లేకుండా పోయాడు. కొన్ని గంటల తర్వాత రెండో భార్యకు ఫోన్ చేసి, తనకు ఆరోగ్యం సరిగా లేదనీ, ఆసుపత్రిలో చేరాననీ చెప్పి నువ్వు మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లమని చెప్పాడు. ఆ తర్వాత పోస్టులో ఆమెకు విడాకుల పత్రాలను పంపాడు. వాటిని చూసిన ఫర్హీన్ షాకయింది. దీనితో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

తర్వాతి కథనం
Show comments