Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొనాల్డ్ ట్రంప్‌కు తర్వాత అమెరికా అధ్యక్షుడి రేసులో వీరేంద్ర సెహ్వాగ్?!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్ష పదవి రేసులో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నట్లు అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ స్టోరీ ప్

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (16:12 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్ష పదవి రేసులో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నట్లు అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ స్టోరీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ కథనాన్ని నిజంగానా అంటూ సీరియస్‌గా తీసుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. 
 
వివరాల్లోకి వెళితే.. ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వీరేంద్ర సెహ్వాగ్.. సమాజంలో జరిగే ప్రతి అంశంపై తనదైన శైలిలో చమత్కారంగా ట్వీట్ చేసి.. అందరి ప్రశంసలు పొందాడు. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్ష రేసులో సెహ్వాగ్ ఉన్నట్లు ప్రచురితమైన కథనాన్ని శనివారం తన ట్విట్టర్‌ ద్వారా అభిమానులకు పంచుకున్న సెహ్వాగ్‌ హ్యాపీ 'ఏప్రిల్‌ ఫూల్స్‌ డే' అని చెప్పారు.
 
ప్రముఖ ఇంగ్లీషు జర్నలిస్ట్ స్టీఫెన్‌ స్మిత్‌ రాసిన ఈ స్టోరీలో.. అప్పుడప్పుడు అమెరికా వస్తున్న సెహ్వాగ్‌తో అమెరికా ప్రభుత్వం రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటోందని ఉంది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాలు ఇద్దరూ కలిసి సెహ్వాగ్‌ను అమెరికా అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎంపిక చేయనున్నారని ఆర్టికల్‌లో స్టీఫెన్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది అమెరికా పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లిన సమయంలో ఇరువురూ మోడీతో ఈ అంశంపై చర్చిస్తారని స్టీఫెన్‌ అందులో పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం
Show comments