Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగలం: గంగాధరం అక్రమాస్తుల విలువ అన్ని కోట్లా?!

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విసిరిన వలలో మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజినీర్ గంగాధరం ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. గంగాధరం

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (16:04 IST)
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విసిరిన వలలో మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజినీర్ గంగాధరం ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. గంగాధరం కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపై ఏసీబీ శనివారం దాడులు నిర్వహిస్తోంది. 
 
కాగా, గంగాధరంకు బినామీగా కొనసాగుతున్న మరో కాంట్రాక్టర్ విశ్వేశ్వరరావు ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. ఈ దాడుల్లో అక్రమాస్తులు బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. 
 
విశాఖపట్నం భీమిలి వద్ద నాలుగు వరుసల రహదారుల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్‌, విజయవాడ, బెంగళూరు, కడప, నెల్లూరు, చిత్తూరు, విశాఖలోని మొత్తం 20 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. 
 
ఈ దాడుల్లో ఆస్తులను సీజ్ చేయడంతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కూకట్ పల్లి నివాసంలో రూ.40లక్షల నగదును సీజ్ చేయగా, కూకట్ పల్లి రాంకీ టవర్స్‌లో రూ.8కోట్ల విలువైన విల్లాను గుర్తించారు. బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్ల విలువైన ఆస్తి ఉన్నట్లు ఏసీబీ జేడీ తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం