Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధరణి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టర్లతో సీఎం సమావేశం

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (11:33 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం జిల్లా కలెక్టర్లతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల అజెండాతో పాటు అభివృద్ధి పనులు, పథకాలపై ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. 
 
దీనిపై ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీచేశారు. పీవోబీ, తప్పులు సరిదిద్దడం తదితర సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని సూచించారు. వీటిపైనే కలెక్టర్లు గత 15 రోజుల నుంచి వీఆర్ఏలు, ఆర్ఐలు, తాహశీల్దారులు, ఆర్డీవోలు ఈ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారించారు. 
 
ధరణి పోర్టల్ పీవోబీ, పాస్ బుక్ డేటా కరెక్షన్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా వారీగా అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిలిపించి సమీక్ష నిర్వహించారు. ఇపుడు అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఈ సమీక్ష నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments