Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్ నగరంలో మరో ఫ్లై ఓవర్ వంతెన

shilpa flyover
, శుక్రవారం, 25 నవంబరు 2022 (10:40 IST)
హైదరాబాద్ నగరంలో మరో ఫ్లై ఓవర్ వంతెన అందుబాటులోకి వచ్చింది. మొత్తం రూ.250 కోట్ల వ్యయంతో ఈ వంతెనను నిర్మిచారు. అటు, ఇటు 30 అంతస్తుల భవనాల నడుమ ఈ వంతెన అందంగా కొనసాగుతుంది. ఆకాశం నుంచి చూస్తే నిజంగానే ఒక శిల్పంలా కనిపిస్తుంది. దీంతో దీనికి శిల్పా వంతెన అని నామకరణం చేశారు. ఈ వంతెన శుక్రవారం నుంచి వాహనదారుల వినియోగానికి అందుబాటులోకి వచ్చింది. 
 
శిల్పా లేఅవుట్ మొదటి దశ ఫ్లై ఓవర్‌ను రూ.250 కోట్ల వ్యయంతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఐకియా మాల్ వెనుక నుంచి ప్రారంభమయ్యే ఈ వంతెనకు ఇరువైపు దాదాపు 30 అడుగుల ఎత్తయిన భవనాలు ఉంటాయి. వీటి మధ్య ఈ వంతెన సాగుతుంది. 
 
రెండు అంతస్తుల్లో నిర్మించిన ఈ వంతెనకు ప్రత్యేకతలు కూడా అనేక ఉన్నాయి. ఆకాశం నుంచి చూస్తే ఇది ఒక శిల్పంలా కనిపిస్తుంది. ఇనార్బిట్ మాల్, రహేజా మైడ్ స్పేస్ చౌరస్తా, బయో డైవర్శిటీ చౌరస్తా మధ్య నిర్మిస్తున్న హైదరాబాద్ నాలెడ్జ్ సెంటర్‌ను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ప్రాజెక్టుల్లో శిల్ప వంతెన నిర్మాణం ఒకటి. ఈ బ్రిడ్జి శుక్రవారం నుంచి అందుబాటులోకి రాగా, వచ్చే నెల నుంచి కొండపూర్ చౌరస్తా వద్ద నిర్మించిన వంతెన ఉపయోగంలోకి రానుంది. 
 
అలాగే, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి గచ్చిబౌలి ఫ్లై ఓవర్ మీదుగా బొటానికల్ గార్డెన్ రోడ్డుపైకి నిర్మిస్తున్న శిల్పా లేఔట్ రెండో దస ప్రాజెక్టు వచ్చే యేడాది డిసెంబరు నాటికి పూర్తికానుంది. నగరంలో నానాటికీ పెరిగిపోతున్న వాహనాల కారణంగా విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. దీనికి కొంతమేరకు పరిష్కరించే చర్యల్లో భాగంగా, హైదరాబాద్ నగరంలోని కూడళ్ళలో ఈ వంతెన నిర్మాణాలు చేపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసి తీరుతాం : అమిత్ షా