Webdunia - Bharat's app for daily news and videos

Install App

గచ్చిబౌలి ఐటీ సెక్టార్‌లో చిరుత కలకలం.. కుక్కను ఎత్తుకెళ్లిందట...

Webdunia
ఆదివారం, 13 డిశెంబరు 2020 (09:42 IST)
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఐటీ సెక్టార్ ప్రాంతంలో ఓ చిరుతపులి కలకలం రేపింది. ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్టు గుర్తించారు. దీంతో స్థానికులందరూ భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 
 
ఈ క్రమంలో తాజాగా ఆదివారం ఉదయం రోడా మిస్త్రీ కాలేజీలోని పెంపుడు కుక్కను చిరుత ఎత్తుకెళ్లినట్లు సమాచారం. విషయం తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు అటవీశాఖ అలెర్ట్ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం చిరుత కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు
 
మరోవైపు, కొమరం భీం జిల్లా బెజ్జూరు మండలం తిక్కపల్లి - భీమారం అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. రోడ్డుపై వెళుతున్న పులిని సమీప గ్రామస్తులు గుర్తించినట్టు తెలుస్తోంది. పులి సంచారం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచిస్తున్నారు. అయితే పులి సంచరిస్తున్న విషయం తెలుసుకుని స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments