Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యారీ బ్యాగ్‌పై లోగో ఉంటే ఉచితంగా ఇవ్వాల్సిందే... లేదంటే ఫైన్

Webdunia
ఆదివారం, 26 మే 2019 (13:21 IST)
పలు రాష్ట్రాల్లో ప్లాస్టిక్‌పై నిషేధం విధించారు. దీంతో అనేక షాపులు, మాల్స్ తమ కంపెనీల పేరుతో లోగోలను ముద్రిస్తున్నాయి. ఇలాంటి బ్యాగులకు కూడా రూ.2 లేదా రూ.5 చొప్పున వసూలు చేస్తున్నాయి. 
 
అయితే, ఆయా కంపెనీలు తమ లోగోలను ముద్రించివుంటే అలాంటి క్యారీబ్యాగులను ఉచితంగా ఇవ్వాల్సిందేనంటూ గతంలో చంఢీగఢ్ రాష్ట్ర వినియోగదారుల ఫోరం తీర్పునిచ్చింది. ఇపుడు ఈ తీర్పును ఆదర్శంగా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వినియోగదారుల వివాదాల పరిష్కార కేంద్రం తీర్పునిచ్చింది. 
 
అంతేకాకుండా, లోగోవున్న క్యారీబ్యాగుకు రూ.5 ధర వసూలు చేసిన బేగంపేటలోని షాపర్స్‌స్టాప్‌ మాల్‌కు ఏడు వేల రూపాయల అపరాధం విధించింది. ఉప్పల్‌కు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి గత నెల 18వ తేదీన ఈ షాపింగ్ మాల్‌లో వస్తువులు కొనుగోలు చేయగా, ఆ వస్తువులను తీసుకెళ్లేందుకు ఇవ్వాల్సిన బ్యాగుకు రూ.5 వసూలు చేశారు. 
 
నిజానికి డబ్బులు వసూలు చేస్తున్నందున లోగో లేని క్యారీ బ్యాగు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ లోగో ఉన్న క్యారీబ్యాగు ఇవ్వడంపై సదరు వ్యక్తి వినియోగదారుల ఫోరంను ఆశ్రయించడంతో తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వినియోగదారుల వివాదాల పరిష్కారం కేంద్రం పై విధంగా తీర్పునిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments