Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకోమంటే పథకం ప్రకారం మట్టుబెట్టాడు

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (09:44 IST)
హైదరాబాద్ నగరంలో ఓ యువకుడు తాను ప్రేమించిన బాలికను దారుణంగా హత్య చేశాడు. పెళ్లి చేసుకోమన్నందుకు పథకం ప్రకారం ఈ హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అల్వాల్‌ల పరిధిలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పాత అల్వాల్‌ పరిధిలో నివసించే దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమార్తెకు పెళ్లి చేయగా, రెండో కూతురు(17) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంటర్‌ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షల సమయంలో భూదేవి నగర్‌కు చెందిన దీపక్‌(20)తో ప్రేమ ఏర్పడింది. 
 
కొన్ని నెలలుగా బాలిక పెళ్లి ప్రస్తావన తెస్తుండటంతో ఆమె ఫోను నంబరు బ్లాక్‌ చేశాడు. అతడితో మాట్లాడాలని సోమవారం ఉదయం స్నేహితుల ద్వారా తాము తరచూ కలుసుకునే బీహెచ్‌ఈఎల్‌ కాలనీ సమీపంలోని ప్రాంతానికి రావాలని సూచించింది. అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటుండగా పెళ్లి ప్రస్తావన రావడంతో ఘర్షణ పడ్డారు. 
 
అప్పటికే ఆమెను వదిలించుకోవాలని ఉన్న దీపక్‌.. చున్నీతో బాలికకు ఉరి వేసి పరారయ్యాడు. కుమార్తె ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం తెల్లవారుజామున పోలీసులు నిందితుడిని సికింద్రాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. 
 
అతనిచ్చిన సమాచారంతో హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్వచ్ఛ ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాత్రి అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments