Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డ్యాడీస్‌ హోమ్ అనాథాశ్ర‌మంలో దేవి శ్రీ ప్రసాద్‌

Advertiesment
Daddy's Home Orphanage
Devisriprasad orphans
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ త‌న పుట్టిన‌రోజు(ఆగ‌స్ట్‌2)ను గన్నవరంలోని డ్యాడీస్‌ హోమ్ అనాథాశ్ర‌మంలో జ‌రుపుకున్నారు. రెండు ద‌శాబ్దాలుగా ద‌క్షిణాది, బాలీవుడ్ చిత్రాల‌కు సంగీతాన్ని అందిస్తూ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్న మ‌న రాక్‌స్టార్ ఈ ఏడాది పుట్టిన‌రోజు వేడుక‌ల‌కు అనాథ పిల్ల‌ల‌తో కేక్ క‌ట్ చేసి సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ నెలలో ఆ పిల్ల‌ల నిర్వ‌హ‌ణ‌కు అయ్యే నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను అందించారాయ‌న‌.
 
వంద‌లాది చిన్నారుల‌కు శ్ర‌ద్ధ‌తో, నిస్వార్ధంగా డ్యాడీస్ హోమ్‌వారు చేస్తున్న సేవ నా మ‌న‌సును తాకింది. గతంలో సర్‌ప్రైజ్‌ అంటూ నన్ను ఇక్కడికి తీసుకురాగా, వాళ్ల కోసం నేను సంగీతం వాయించాను. అప్పటి నుంచి వాళ్లతో కనెక్ట్‌ అయిపోయాను. నా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆశ్రమంలోని కొందరు చిన్నారుల బాగోగులను చూసుకోవడం నా బాధ్యతగా స్వీకరిస్తున్నాను. ఇప్పుడున్న క‌ఠిన ప‌రిస్థితుల్లో ఇలాంటి వారికి అండ‌గా నిల‌బ‌డాల్సిన అవ‌స‌రం మ‌న‌కెంతో ఉంది. ఎవ‌రైనా డ్యాడీస్ హోం వారికి సాయం చేయాల‌నుకుంటే 9948661346 నెంబ‌ర్‌కు కాల్ చేసి మీ వంతు సాయాన్ని అందించండి  అని తెలిపారు దేవిశ్రీప్ర‌సాద్‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రిస్మస్‌కి "పుష్ప" పార్ట్ 1: బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ ఖుషీ