Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యుత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా హైదరాబాద్ విమానాశ్రయం

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (10:55 IST)
హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరోసారి అత్యుత్తమ ప్రాంతీయ విమానాశ్రయం అవార్డును సొంతం చేసుకుంది. 2021 సంవత్సరానికి గాను ప్రపంచస్థాయిలో ఇచ్చే స్కైట్రాక్స్‌ అవార్డును దక్కించుకుంది. వరుసగా మూడుసార్లు ఈ ఘనతను సొంతం చేసుకోవడం విశేషం. 
 
దీంతోపాటు ప్రపంచస్థాయిలో నిర్ధారించే టాప్‌ 100 విమానాశ్రయాల్లో 64 స్థానంలో నిలిచిందని GMR వర్గాలు వెల్లడించాయి. గతంలో 71వ ర్యాంకు ఉండేదని పేర్కొన్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా స్కైట్రాక్స్‌ విమాన ప్రయాణికుల అభిప్రాయాలు, వారి సంతృప్తిని కొలమానంగా చేసుకుని అవార్డులను అందజేస్తుంది.
 
ప్రపంచవ్యాప్తంగా 550 విమానాశ్రయాల్లోని ప్రయాణికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులను ప్రకటిస్తుంది. కోవిడ్‌ పరిస్థితుల్లో కూడా జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్‌ ఆధునిక సాంకేతికతతో ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతోనే ఈ అవార్డు దక్కిందని గెయిల్‌ సీఈవో ప్రదీప్‌ ఫణీకర్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments