Webdunia - Bharat's app for daily news and videos

Install App

హేమంత్ పరువు హత్య కేసులో 25 మందికి ప్రమేయం!

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (13:08 IST)
హైదరాబాద్ నగరంలోని చందానగర్‌లో జరిగిన ఇంటీరియల్ డిజైనర్ హేమంత్ పరువు హత్య కేసులో మొత్తం 25 మందికి సంబంధం ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఈ కేసులో ఇప్పటికే 21 మందిని అరెస్టు చేసిన గచ్చిబౌలి పోలీసులు.. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అంతేకాకుండా, ఈ కేసులో అరెస్టు చేసిన నిందితులను మరోసారి తమ కస్టడీకి తీసుకుని ప్రశ్నించనున్నారు. 
 
మరోవైపు, ఈ కేసులో మృతుని భార్య అవంతి, హేమంత్ తల్లిదండ్రులు మంగళవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు వచ్చి తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగ్ అవంతి మాట్లాడుతూ, సందీప్ రెడ్డి అనే వ్యక్తి వల్ల తనకు ప్రాణహాని ఉందని, ఆయన్ను తక్షణం అరెస్టు చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా, తన తల్లిదండ్రులతో మేనమామ యుగేందర్ రెడ్డిని హేమంత్‌ను చంపేసిన స్పాట్‌లో ఎన్‌కౌంటర్ చేసి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. 

సీపీ సజ్జనార్ ఆదేశాలను ఖాతరు చేయని పోలీసులు... 
కులాంతర వివాహం చేసుకున్న హేమంత్, అవంతిలకు రక్షణ కల్పించాలని సీపీ సజ్జనార్ చందానగర్ పోలీసులను ఆదేశించారు. కానీ, వారు కొత్త దంపతులకు భద్రత కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా హేమంత్‌ను కులోన్మాదం హత్య చేసింది. 
 
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హేమంత్‌ హత్యోదంతానికి కులోన్మాదమే కారణమని సైబరాబాద్‌ పోలీసులు తేల్చారు. ఈ మేరకు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ యుగేంధర్‌రెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
 
అయితే, హేమంత్‌ - అవంతి వ్యవహారంలో చందానగర్‌ పోలీసుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. కొత్త దంపతులు రక్షణ కోరుతూ తనను కలిశాక సీపీ సజ్జనార్‌ చందానగర్‌ పోలీసులకు ఫోన్‌చేసి భద్రత కల్పించాలని ఆదేశించారు. అవంతి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలన్నారు. కానీ, ఈ  వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. 
 
పెళ్లయిన వారం రోజులకు అవంతి, హేమంత్‌లను కౌన్సెలింగ్‌ కోసమని పిలిచిన పోలీసులు.. అక్కడ అవంతి తల్లిదండ్రులకే వత్తాసు పలికారు. లక్ష్మారెడ్డి, అర్చన, యుగేంధర్‌రెడ్డిలు పోలీసుల ముందే హేమంత్‌, అతడి తల్లిదండ్రులను దుర్భాషలాడుతున్నా వారించలేదు. 'మీరు ఎలా బతుకుతారో చూస్తాం' అంటూ హెచ్చరించడంతో.. తమకు ప్రాణహాని ఉందంటూ హేమంత్‌ కుటుంబం అదే రోజు ఫిర్యాదు చేయగా.. దానిపట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments