Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనిచేయని టీకా: వ్యాక్సిన్ వేసుకున్న 20 రోజుల తర్వాత కరోనా!

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (11:18 IST)
కరోనా వైరస్ సోకకుండా అభివృద్ధి చేసిన టీకా పెద్ద ప్రభావం చూపుతున్నట్టు లేదు. ఈ టీకా తీసుకున్న పలువురు మృత్యువాతపడుతున్నారు. అలాగే, మరికొందరికి ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్ సోకుతోంది. తాజాగా కరోనా టీకా వేయించుకున్న 20 రోజుల తర్వాత హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ప్రముఖ వైద్యులు వైరస్ బారిన పడటం కలకలం రేపింది. 
 
నిమ్స్‌కు చెందిన ఓ రెసిడెంట్ డాక్టర్‌కు, ఉస్మానియాకు చెందిన పీజీ విద్యార్థికీ కరోనా సోకింది. వీరిద్దరూ దాదాపు 20 రోజుల క్రితం కరోనా టీకా తొలి డోస్‌ను తీసుకున్నారు. కాగా, ఇద్దరు వైద్యులకు కరోనా సోకిన విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. 
 
టీకా తీసుకున్న తర్వాత వీరిద్దరూ తమకు వైరస్ సోకదన్న ధీమాతో మాస్క్ ధరించలేదని, భౌతిక దూరం పాటించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం వంటి నిబంధనలు పాటించలేదని, ఈ కారణంగానే వైరస్ సోకిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే, ఆ ఇద్దరి వైద్యులు పేర్లు మాత్రం బహిర్గతం చేయడం లేదు. 
 
కాగా, మన దేశంలో వ్యాక్సినేషన్ గత నెల 16న ప్రారంభం కాగా, రెండో డోస్ ఇవ్వడం ఇప్పుడే మొదలైంది. అయితే, రెండు డోస్‌లనూ ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, తొలి డోస్ తీసుకున్న 42 రోజుల తర్వాతనే శరీరంలో కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీస్ వృద్ధి జరుగుతుందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. టీకా తీసుకున్నా అన్ని జాగ్రత్తలతో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే, చాలా మంది ఈ వైరస్ సోకదన్న భావనలో ఉన్నారు. ఫలితంగానే టీకా వేయించుకున్న తర్వాత కూడా ఈ వైరస్ సోకుతోంది. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments