Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై కోపంతో ఎంత పని చేశాడో తెలుసా? చివరికి దొరికిపోయాడు..

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (12:32 IST)
క్షణికావేశంతో నేరాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడో భర్త భార్యపై కోపంతో నకిలీ ఈమెయిల్‌ ఐడీ సృష్టించి.. ఆమె ప్రతిష్టకు భంగం కలిగించాలనుకున్నాడు. కానీ పోలీసులుకు దొరికిపోయాడు. అతనిని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. రామంతాపూర్‌ ఉప్పల్‌ ప్రాంతానికి చెందిన సుసర్లా వెంకట కిశోర్‌ ప్రైవేటు ఉద్యోగి. 
 
అతడి భార్య ఓ పేరొందిన సంస్థలో రిసెప్షనిస్టు. అదే సంస్థలో పని చేస్తున్న అటెండర్‌ బాలరాజు. వెంకట్‌కు మరొకరితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అతడి భార్యకు చెప్పాడు. దీంతో ఆమె ఈ విషయంపై భర్త వెంకట్‌ను నిలదీసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో బాధితురాలు.. భర్త, కూతురిని వదిలేసి తన తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత వెంకట్‌ తిరిగి రావాలని విజ్ఞప్తి చేసినా.. రాకపోవడంతో భార్యపై కోపం పెంచుకున్నాడు. 
 
భార్య ఆఫీసులో పనిచేసే అటెండర్‌ బాలరాజు పేరుతో ఓ ఫేక్‌ ఈమెయిల్‌ ఐడీని సృష్టించి అందులో ఆమె ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా రాతలు పెట్టాడు. దీంతో బాధితురాలు మానసిక వేదనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన అధికారులు ఈ మెయిల్‌ను రూపొందించింది బాధితురాలి భర్త వెంకట కిశోర్‌ అని గుర్తించి అతడిని అరెస్ట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments